మాటంటే మాటే!
జనాలని కలిపే వంతెనలు మాటలు, అలాగే, విడగొట్టే కత్తులు కూడా మాటలే. మాటలతో యుక్తిగా సంబంధాలు క;లిపే,అగ్నిభట్టారకులూ,ఉంటారు,మాటలతో,పుల్లలు పేట్టి జనాలని విడగొట్టే,నారదమునులూ ఉంటారు.ఏమైనా,మాటలు రెండందాలా పనికొచ్చే అస్త్రాలే మరి. మాటలు జాగ్రత్తగా రానీ....మాటమ్టే మాటే అంటూ మాటను పట్టుకు వేలాడే మనుజులు ,మనకు నిద్ర లేస్తే కోకొల్లలు. అసలు నిజానికి మాటల్లేనిదే మనుగడ ఉంటున్దా...? మన పిచ్చి కానీ... మాటలెలా పుడతాయి ఎవరో ఒకరు కనిపెట్టకపోతే అని మాయబజార్ లో ఘటోత్కచుడి చేత అనిపించిన మాట వాస్తవమే, లేకుంటే ఏడాది రెండేండ్లు నిండిన పాప మాటలు చూడండి.ఏకమ్గా ఒక డిక్షనరీనే చేయచ్చు. క బదులు,త,స బదులు త ఇలా ఏదో ఒకటి మార్చేస్తూ క్రొత్త క్రొత్త మాటలు పుట్టించేస్తూ ఉంటారు పిల్లలు. అదో ముచ్చట. "మాట జారితే తీసుకోలేము,కాలు జారితె తీసుకోవచ్చు " అని అనటానికి అంటామ్ కానీ,మాటకి ఆ పాటి విలువ పోయి చాన్నాళ్ళే అయిన్దని చెప్పొచ్చు.ఇవాళ్రేపు,రాజకీయ నాయకులు,ఎన్నెన్ని మాటలు,ఎంతలేసి మాటలయినా ,అనటానికి వెనుదీయరు,సరి కదా,అదే ప్రత్యర్ధి పార్టీలోకి మారి,అంతకు ముందరి పార్టీ వారి...